స‌ల్మాన్ ఖాన్‌కు బెయిల్‌

స‌ల్మాన్ ఖాన్‌కు బెయిల్‌

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ని జోథ్ పూర్ సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, బెయిల్ ఆర్డర్ కాగితాలు జైలు అధికారులకు అందిన అనంతరం పరిశీలన  ప్రక్రియపూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈరోజు రాత్రి ఏడున్నర గంటల సమయంలో సల్మాన్ ని విడుదల చేయవచ్చని సీనియర్ న్యాయవాది భరత్ భూషణ్ శర్మ తెలిపారు. కాగా, ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.