fingoshop
fingoshop

సైరా మ్యూజిక్ డైరెక్టర్ .....?

సైరా  మ్యూజిక్ డైరెక్టర్ .....?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి గురించి ఇప్పుడు మరో వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్‌కు సంబంధించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ను ఇంకా ఎంపిక చేయలేదు.

ముందుగా ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అధికారికంగా ప్రకటించారు. కానీ, డేట్లు సర్దుబాటు కాకపోవటంతో రెహమాన్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత థమన్‌ పేరు తెరపైకి వచ్చింది. అటుపై కీరవాణి పేరు వినిపించింది. ఇక ఇప్పుడు క్లాసిక్‌ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా పేరు చక్కర్లు కొడుతోంది. 

అయితే సైరా చరిత్రకు సంబంధించిన కథ కావటంతో పాటల కన్నా ఎక్కువగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌పైనే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని చిరు భావిస్తున్నాడంట. ఈ నేపథ్యంలో కీరవాణి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చని టాక్‌. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌  పూర్తి చేసుకున్న సైరా.. రెండో షెడ్యూల్‌కు రెడీ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటిదాకా మ్యూజిక్‌ డైరెక్టర్‌ విషయంలో స్పష్టత లేకపోవటం విశేషం.