ప్రభాస్ కి దుబాయ్ అధికారులు నో అన్నారు

ప్రభాస్ కి దుబాయ్ అధికారులు నో అన్నారు

ప్రభాస్  ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సుజిత్‌ దర్శకత్వ౦ వహించారు .భారీ యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ కోసం చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తుండగా కొద్ది రోజులుగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

యాక్షన్‌ సీన్స్‌ను ఫైట్స్ తో పాటు చేజ్‌ సీన్స్‌ కూడా దుబాయ్ లో  చిత్రీకరించాలని భావించారు. అయితే దీనికి దుబాయ్ అధికారులు అనుమతులు ఇవ్వలేదు . ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీ లో భారి సెట్ వేసి షూటింగ్ అక్కడ ప్రారంబిస్తారు.

ఈ సినిమా లో ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ నటించనున్నది.