సాహో కి మరో ఏడాది

సాహో కి మరో ఏడాది

‘సాహో’ సినిమాపై ప్రభాస్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ‘బాహుబలి-2’ తో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ‘సాహో’కి తెలుగు మూవీ నుంచి మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్‌గా ప్రమోషన్ ఇచ్చాడు. యువి క్రియేషన్స్ కూడా ఈ సినిమా బడ్జెట్‌ను 150కోట్ల దాకా పెంచేసింది. ఇక దర్శకుడు సుజిత్ ఈ సినిమాను హాలీవుడ్ స్టయిల్ లో రూపొందించి ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలనే లక్ష్యతో వెళ్తున్నాడు. ప్రభాస్ కూడా స్లిమ్ లుక్ లోకి వచ్చేశాడు. యంగ్ రెబల్ స్టార్ ఇంత ప్రిస్టేజియస్‌గా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ కంటే ముందే ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వలో కమిట్ అయిన సినిమాని రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడు.


‘సాహో’ షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అయ్యింది. దుబాయ్ షెడ్యూల్ ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. పైగా ఈ సినిమాలో గ్రాఫికల్ వర్క్స్ ఎక్కువగా ఉందట. దీంతో ‘సాహో’ కంప్లీట్ కావడానికి మరో ఏడాది పడుతుందని సమాచారం. అందుకే జూలైలో రాధాకృష్ణ దర్శకత్వలో సినిమా లాంచ్ చెయ్యాలనుకుంటున్నాడు.2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని జనాల ముందు నిలపాలనుకుంటున్నాడు ప్రభాస్. కృష్ణంరాజు ఈ సినిమా నిర్మించబోతోన్నాడు. ప్రభాస్ తో పూజ హెగ్డే జత కట్టబోతుంది.