పెళ్లైన త‌ర్వాత కూడా నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ట‌చ్‌లోనే ఉంటాను - రేణు దేశాయ్

పెళ్లైన త‌ర్వాత కూడా నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ట‌చ్‌లోనే ఉంటాను - రేణు దేశాయ్

త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తితో త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్న న‌టి రేణూదేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రం అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు రేణూదేశాయ్. తాజాగా లైవ్‌లోకి వ‌చ్చిన రేణు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల గురించి మాట్లాడారు.

`పెళ్లి త‌ర్వాత కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ట‌చ్‌లోనే ఉంటారాఅని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు రేణు స‌మాధాన‌మిచ్చారు. `త‌ప్ప‌కుండా. పెళ్లైన త‌ర్వాత కూడా నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ట‌చ్‌లోనే ఉంటాను. నాకు వేరే ఆప్ష‌న్ లేదు. ఎందుకంటే నా ఇద్ద‌రి పిల్ల‌ల‌కు అత‌ను తండ్రి. సెల‌వులుఇత‌ర వేడుక‌ల సంద‌ర్భగా నా పిల్ల‌ల‌ను తండ్రి ద‌గ్గ‌ర‌కు పంపిస్తుండాలి. పిల్ల‌ల భ‌విష్య‌త్తు గురించి ప‌వ‌న్‌తో చ‌ర్చిస్తుండాలిఅని రేణు స‌మాధాన‌మిచ్చారు.