నాకు ప్రైవ‌సీ ఇవ్వ‌డం లేదు - రేణూ దేశాయ్‌ ట్వీట్

నాకు ప్రైవ‌సీ ఇవ్వ‌డం లేదు - రేణూ దేశాయ్‌ ట్వీట్
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వ‌ర‌లో మ‌రో వ్య‌క్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా ఆమె స్వ‌యంగా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు కాబోయే భ‌ర్త చేయిప‌ట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసి..`నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను. నా చేయి ప‌ట్టుకో ఎన్న‌టికీ విడువ‌కు` అంటూ రేణూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.
తాజాగా రేణు త‌న పిల్ల‌లు, స్నేహితుల‌తో కలిసి విహార యాత్ర కోసం గోవా వెళ్లారు. అక్క‌డ స్విమ్ సూట్‌లో తీయించుకున్న ఫోటోను రేణు షేర్ చేశారు. `ఈ ఫోటోను నా స్నేహితులు తీశారు. ఆ స‌మ‌యంలో నా కాబోయే భ‌ర్త పంపిన మెసేజ్‌ల‌ను చ‌దువుతున్నాను. అలాంటి స‌మ‌యాల్లో కూడా ఫోటోలు తీస్తూ నా స్నేహితులు నాకు ప్రైవ‌సీ ఇవ్వ‌డం లేదు` అంటూ రేణు ట్వీట్ చేశారు.