ఏ మంత్రం వేసావే మూవీ కి ప్రమోషన్ లేదా

ఏ మంత్రం వేసావే మూవీ కి ప్రమోషన్ లేదా

పెళ్లి చూపులుతో సోలో హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ . ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సూపర్ హిట్ కొట్టడంతో వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏ మంత్రం వేశావే...సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఇది 2013లో తీసిన సినిమా. అప్పట్లో విజయ్ ఎవరో ప్రేక్షకులకు కూడా తెలియదు. దీంతో సగం తీసి ఆపేశారు. ఇప్పుడు విజయ్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావించి... ఆ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. ఆ సినిమాకు ఎలాంటి ప్రచారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు అర్జున్ రెడ్డి. ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టం లేని విజయ్... ఆ సినిమాను చూడమని ఎవరికీ చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాడట.