విషాదం లో రావు రమేష్ కుటుంబం

విషాదం లో రావు రమేష్ కుటుంబం

ప్రముఖ హరికథా కళాకారిణి, ప్రముఖ నటులు రావు గోపాల్‌ రావు భార్య కమల కుమారి (73) ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. పలు రాష్ట్రాల్లో ఆమె 5000లకు పైగా హరికథ ప్రదర్శనలిచ్చారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు.  గత కొన్ని రోజులుగా అనారోగ్య౦తో బాధపడుతున్న ఆమె ఈరోజు శనివారం ఉదయం తెల్లవారుజామున కొండాపూర్లోని రావు రమేష్ నివాసంలో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేయగా మెగాస్టార్ చిరంజీవి ఆమెకు నివాళులర్పించేందుకు రావు రమేష్ నివాసానికి బయలుదేరారు.