స్వర్గం లో ఎన్టీఆర్ చెప్పినట్టే చేస్తున్న "వర్మ"

స్వర్గం లో ఎన్టీఆర్ చెప్పినట్టే చేస్తున్న "వర్మ"

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. ‘యన్‌.టి.ఆర్‌’ మూవీపై మాటల దాడిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే  దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు.. తాను తెరకెక్కిస్తున్న బయోపిక్‌కు మాత్రమే ఉంటాయని పదే పదే చెపుతున్న వర్మ, తాజాగా మరిన్ని ఆసక్తికర ట్వీట్‌లు చేశారు. తానే తెరకెక్కిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ట్రైలర్‌ ఎప్పుడు రిలీజ్ చేయాలన్న విషయాన్ని స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌ తనకు సూచించారని ట్వీట్ చేశాడు వర్మ.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ థియట్రికల్‌ ట్రైలర్‌ ఎప్పుడు రిలీజ్ చేయబోయేది ‘యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించటంపై ఆధారపడి ఉంది. మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే ట్రైలర్‌ రిలీజ్ చేయాల్సిందిగా స్వర్గం నుంచి ఎన్టీఆర్‌ నాకు సందేశం ఇచ్చారు. యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటించిన 24 నిమిషాల తరువాత లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ రిలీజ్ చేయాలని ఎన్టీఆర్‌ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆయన సొంత కొడుకు కథానాయకుడును కాకుండా భార్య లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మాత్రమే ఆశీర్వదిస్తారు అనటానికి కథానాయకుడు రిజల్టే నిదర్శనం. ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్‌ల మధ్య పోటీని ఆయన స్వాగతిస్తారు’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రిలీజ్‌ డేట్‌పై సందిగ్ధత ఏర్పడింది. తొలి భాగం డిజాస్టర్‌ కావటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ఇదే అదునుగా వర్మ తన మాటలు, ట్వీట్లతో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు కావాల్సినంత ప్రమోషన్‌ చేసుకుంటున్నాడు.