ప్రపంచం లోనే ఖరీదైన కాఫీ ని గిఫ్ట్ గ ఇచ్చాడు

ప్రపంచం లోనే ఖరీదైన కాఫీ ని గిఫ్ట్ గ ఇచ్చాడు

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఓ హీరో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ గింజల ప్యాకెట్‌ను కానుకగా ఇచ్చాడట. ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇస్మార్ట్‌ శంకర్‌సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌.. పూరికి ఓ కాఫీ గింజల ప్యాకెట్‌ను కొనిచ్చాడట. ఈ విషయాన్ని పూరి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.మేరా ఇస్మార్ట్‌ శంకర్రామ్‌ నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని కానుకగా ఇచ్చాడు. దీనిని కోపీ లువా‌క్‌ అంటారు. దీని గురించి గూగుల్‌లో వెతకండి. మీకు ఈ కాఫీ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. నేను ఈ కాఫీని తాగుతున్నానుఅంటూ ఫొటోలను పోస్ట్‌ చేశారు.

పూరి పెట్టిన పోస్ట్‌కు రామ్‌ స్పందిస్తూ.. ఈ కాఫీ గురించి గూగుల్‌లో వెతక్కండి. దీని గురించి తెలిస్తే దిమాగ్‌ ఖరాబ్‌ ఐతదిఅని చమత్కరించారు. ఈ కోపీ లువాక్‌ కాఫీని చెర్రీస్‌తో తయారుచేస్తారట. దీనిని ఎక్కువగా ఇండోనేసియాలోని సుమత్రా,జావా, బాలి, సులావెసి ప్రాంతాల్లో పండిస్తుంటారు. ఇండోనేసియాలో కాఫీని కోపి అని సంబోధిస్తారు. లువాక్‌ అంటే సుమత్రా దీవుల్లో ఉండే ఆసియన్‌ పామ్‌ సివెట్ అనే జంతువు పేరు. ఒక్కో కప్పు కాఫీ ధర సుమారు 35 డాలర్ల నుంచి 80 డాలర్ల వరకు ఉంటుంది. అయితే ఏ సందర్భంగా తనకు ఈ కాఫీ కొనిచ్చాడన్న విషయాన్ని మాత్రం పూరి వెల్లడించలేదు.