"రాక్షసుడు" మూవీ రివ్యూ

"రాక్షసుడు" మూవీ రివ్యూ

టైటిల్‌ : రాక్షసుడు

జానర్‌ : సస్పెన్స్‌ క్రైమ్‌ థిల్లర్‌

తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు

సంగీతం : గిబ్రాన్‌

నిర్మాత : కోనేరు సత్యనారాయణ

దర్శకత్వం : రమేష్‌ వర్మ

మాస్‌ ఫాలోయింగ్‌ పెంచుకుందామని రొటీన్‌ సినిమాలను చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఈ సారి మాత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్‌(తమిళ మూవీ రాక్షసన్‌)ను ఎంచుకున్నాడు. రాక్షసుడు చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ హీరోకు.. విజయం లభించిందా? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


కథ

స్కూల్‌ ఏజ్‌ అమ్మాయిలనే టార్గెట్‌ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) సినీ రంగంలో తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటాడు. దర్శకత్వం చేపట్టాలని ప్రతీ ఆఫీస్‌ గడప తొక్కుతూ ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కోసం ప్రపంచంలో నలుమూలలా జరిగే సైకో హత్యల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే అరుణ్‌కు సినీ రంగంలో అవకాశాలు రాక.. చివరకు కుటుంబం ఒత్తిడి మేరకు పోలీస్‌ ఉద్యోగంలో చేరతాడు. అరుణ్‌.. పోలీస్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ అయిన తరువాత మళ్లీ ఓ హత్య జరగుతుంది. ఇక ఆ హత్యలను చేసేది ఎవరనే విషయాన్ని అరుణ్‌ కనిపెట్టాడా? అసలు ఆ హత్యలు చేసే వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? అనేదే మిగతా కథ.


నటీనటులు

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌.. యాక్షన్‌ సీన్స్‌తోపాటు, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ బాగా నటించాడు. ఇంతకుముందు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించినా.. ఈ మూవీలో మాత్రం ఇంటెన్సిటీతో నటించాడు. ఇక టీచర్‌గా కృష్ణవేణి పాత్రలో అనుపమా.. లుక్స్‌తో బాగానే ఆకట్టుకుంది. కనిపించింది తక్కువే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాజీవ్‌ కనకాల మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో తన అనుభవాన్ని చూపించాడు. రాక్షసుడు పాత్రను తెరపై చూస్తేనే ఆ థ్రిల్‌ను ఫీల్‌ అవ్వొచ్చు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు.

ఇక గిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్‌ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.


ప్లస్‌ పాయింట్స్‌

కథ, కథనం

బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌


మైనస్‌ పాయింట్స్‌

ఎంటర్‌టైన్మెంట్‌ లేకపోవడం

తమిళ వర్షన్‌ చూసినవారికి థ్రిల్లింగ్‌గా అనిపించకపోవడం