క్షణాల్లో వైరల్ గా మారిన రాజమౌళి RRR

క్షణాల్లో వైరల్ గా మారిన రాజమౌళి RRR

రాజమౌళి దర్శకత్వం లో  రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ RRR, ఈ సినిమా పై ఇప్పటికే  అంచనాలు భారీస్థాయిలో వున్నాయి.  ఎందుకంటే టాలీవూడ్ టాప్ హీరోలు రామ్ చరణ్ తేజ్ మరియు జూ.ఎన్టీఆర్  ఈ సినిమాలో కలసి నటిస్తున్నారు అందులో రాజమౌళి సినిమా . ఈ సినిమా షూటింగ్ మొదలయింది , ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రాజమౌళి ఒక ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఇది  క్షణాల్లోనే వైరల్ గ మారిపోయింది . ఫోటో లో  రాజమౌళి కి ఒక వైపు రాంచరణ్ మరోవైపు ఎన్టీఆర్ కూర్చొని వున్నారు. ఈ ఫోటో కి సోషల్ మీడియా లో లైక్స్, షేర్స్, కామెంట్స్  బాగానే వస్తున్నాయి. రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉ న్న కారణంగా ,తొలుత ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలుపెట్టి తరువాత  చరణ్ జాయిన్ అవుతారని  ప్రచారం జెరిగినప్పటికీ ఇటీవల జరిగిన చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా షూటింగ్ పై స్పష్టత వచ్చింది. దీంతో ఇరువురు హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.