fingoshop
fingoshop

అమ్మాయి చూపులకు అబ్బాయులు ఫిద

అమ్మాయి చూపులకు అబ్బాయులు ఫిద

ప్రేమికుల రోజు దగ్గర పడుతోంది . ప్రేమికులు వారం రోజుల ముందు నుంచే తమకు ఇష్టమైన వారిని కానుకలతో ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలా అని తెగ ఆలోచించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అందమైన అమ్మాయి(ప్రియ ప్రకాష్) తన ప్రియుడిని చూస్తూ కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..మలయాళంలో తెరకెక్కుతున్న ‘ఒరు అదర్ లవ్‌’ అనే చిత్రంలో కథానాయిక ప్రియ ప్రకాష్ వారియర్‌. ఆదివారం ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవి’ అనే పాట విడుదలైంది. ఆ చిత్రంలో ప్రియ హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది. పక్కనే నిలబడిన తన ప్రియుడిని చూసి ప్రియ కన్ను కొడుతున్న సన్నివేశం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను ఒక్కరోజులో 40 లక్షల మందికి పైగా వీక్షించారు.