ప్రభుదేవా మూకీ సినిమా

ప్రభుదేవా మూకీ సినిమా

నృత్య దర్శకుడిగా, కథానాయకుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రభుదేవా. ఇక ‘పిజ్జా’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. వీరిద్దరి కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘మెర్క్యురీ’. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే? ఇందులో డైలాగ్స్‌ ఉండవట. సైలెంట్‌ థ్రిలర్ల్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్‌ నారాయణ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.