ప్రభుదేవా గులేబకావళి మూవీ విశేషాలు

ప్రభుదేవా గులేబకావళి మూవీ విశేషాలు

నటినటులు : ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్

స్టంట్స్ : పీటర్ హెయిన్స్

సంగీతం : వివేక్ మెర్విన్

కెమెరా : ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్

ఆర్ట్ : కదీర్

పాటలు : సామ్రాట్

దర్శకత్వ౦ : కల్యాణ్

నిర్మాత : మల్కాపురం శివకుమార్ 

ప్రముఖ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా హీరోగా, హాన్సిక హీరోయిన్‌గా, ప్రముఖ నటి రేవతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వ౦ లో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. మార్చి 16న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విశేషాలను ఆయన తెలియజేస్తూ తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపధ్యము లో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా వుంటుంది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా వుంటుంది. మార్చి 16న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.