అబుదాబి సలామ్..

అబుదాబి సలామ్..

‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం అబూదాబిలో షూటింగ్ జరుపుకుంటుంది. 50 రోజుల పాటు 250 మంది యూనిట్‌తో రాత్రిపగలు అనే తేడా లేకుండా అబూదాబిలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న ప్రభాస్‌ అక్కడి రాజకుటుంబీకులతో సమావేశమయ్యారు. రాయల్‌ ఫ్యామిలీకి చెందిన మహిళతో ప్రభాస్‌ సమావేశానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.మీడియా కూడా ఎక్స్ క్లూజివ్‌గా కవరేజీ అందిస్తూ సాహో స్టామినాని పెంచేస్తుంది.