`ఆట‌గ‌దరా శివ` చిత్రంలో పాట‌ను విడుద‌ల చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

`ఆట‌గ‌దరా శివ` చిత్రంలో పాట‌ను విడుద‌ల చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌
ఎట్టాగ‌య్యా శివ శివ నీవ‌న్నీ వింత ఆట‌లే.. పుట్టుక‌, చావు యాత‌న నువ్వు రాసే నుదుటి రాత‌లే...
నింగి నేల అంద‌రికొక‌టే వందాలోచ‌న‌లెందుకు...
అంటూ తాత్విక గీతాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో విడుద‌ల చేశారు. 
రాక్ లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సెన్సిబుల్ డైరెక్ట‌ర్ చంద్ర సిద్ధార్థ్ ద‌ర్శ‌క‌త్వలో రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మించిన చిత్రం `ఆట‌గ‌ద‌రా శివ‌`. జూలై 20న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన `రామ రామ రే` చిత్రాన్ని ఆధారంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పైన పెర్కొన్న పాట‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడుద‌ల చేశారు. అనంత‌రం..
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``చైత‌న్య ప్ర‌సాద్‌గారి సాహిత్య చాలా బావున్నాయి. నాకు బాగా న‌చ్చింది. వాసుకి వైభ‌వ్‌ గారు కూడా రాసిన శివ‌త‌త్వ పాట నాకు చాలా బాగా న‌చ్చింది. హీరో ఉద‌య్‌శంక‌ర్ నాకు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుసు. ఉద‌య్ నాన్న‌ శ్రీరామ్‌గారు మాకు గురువు. మేం ఆయ‌న్ను సార్ అంటుంటాం. ఆయ‌న ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్‌.. నాకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయ‌న‌. గోకులంలో సీత సినిమా నుండి ఉద‌య్‌ను చూస్తున్నాను. ఉద‌య్ న‌టించిన చిత్ర‌మే `ఆటగ‌దరా శివ‌` ఉరి శిక్ష ప‌డ్డ ఖైదీ జీవితానికి సంబంధించిన క‌థాంశం. డైరెక్ట‌ర్ చంద్ర సిద్ధార్థ గారు డైరెక్ట్ చేసిన `ఆ న‌లుగురు` వంటి సినిమాలు యూనిక్‌గా ఉంటాయి. ఈ సినిమా విజువ‌ల్స్ చూస్తుంటే కొత్త‌గా, డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. ఉద‌య్ శంక‌ర్ పాత్ర కూడా నాకు కొత్త‌గా అనిపించింది. రెగ్యుల‌ర్ హీరోలా కాకుండా ఓ క్యారెక్ట‌ర్‌ను ఎష్టాబ్లిష్ చేసుకునే ప్ర‌య‌త్న నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.