‘పేపర్ బాయ్’ మూవీ రివ్యూ

నటీనటులు : సంతోష్ శోభన్, రియా, తాన్యా , పోసాని కృష్ణ మురళి, బిత్తిరీ సత్తి, విద్యుల్లేక, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం : బీమ్స్
సినిమాటోగ్రఫర్ : సౌందర్య రాజన్
స్క్రీన్ ప్లే : సంపత్ నంది
ఎడిటర్ : తమ్మి రాజు
దర్శకత్వం : జయశంకర్
నిర్మాతలు : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
మాస్ మసాలా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఇప్పుడు నిర్మాతగా మన ముందుకు వచ్చాడు. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో సంపత్ నంది నిర్మాతగా ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా సంయుక్తంగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పేపర్ బాయ్”.
కథ : రవి (సంతోష్ శోభన్) బీటెక్ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. దాంతో రవి, ధరణి నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రవికి ధరణిని వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తోంది ? అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు రవి వదిలేయాల్సి వచ్చింది ? అసలు వారి పెళ్లికి వచ్చిన సమస్య ఏమిటి ? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ : పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాకు హిట్ ఫార్ములా. ఇప్పటికే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. సంపత్ నంది అందించిన స్క్రిప్ట్ ను, దర్శకుడు జయ శంకర్ బాగానే తెరకెక్కించన్నప్పటికీ, స్క్రిప్ట్ లో కొన్ని లోపాలు ఉండటం కారణంగా.. దర్శకుడు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది.
ప్లస్ పాయింట్స్ : నటీనటుల నటన
సంగీతం
మైనస్ పాయింట్స్ : కథనం
రేటింగ్ : 3/5