పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి..

పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి..
న‌టీన‌టులుసంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌మురళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యాల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్ట త‌దిత‌రులు
ద‌ర్శ‌కుడు : జ‌య‌శంక‌ర్
నిర్మాత‌లు : స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా
నిర్మాణ సంస్థ‌లు : స‌ంపత్ నంది టీమ్ వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా మ‌రియు ప్ర‌చిత్ర క్రియేష‌న్స్
సంగీతం : భీమ్స్ సిసిరేలియో
సినిమాటోగ్ర‌ఫీ : సౌంద‌ర్ రాజ‌న్ 
ఎడిట‌ర్ : త‌మ్మిరాజు
ఆర్ట్ డైరెక్ట‌ర్ : రాజీవ్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ముర‌ళి మామిళ్ళ‌
సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు. పేప‌ర్ బాయ్ లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా రియా సుమ‌న్, తాన్యా హోప్ న‌టించారు. జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మిలియ‌న్ వ్యూస్ కూడా దాటింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు.