పంతం మూవీ రివ్యూ

పంతం మూవీ రివ్యూ

తారాగ‌ణం : గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ 

సంగీతం : గోపీ సుంద‌ర్‌

ఛాయాగ్ర‌హ‌ణం : ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌

మాట‌లు : ర‌మేశ్ రెడ్డి, శ్రీకాంత్‌

కూర్పు : ప‌్ర‌వీణ్ పూడి

క‌ళ‌ : ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌

నిర్మాత‌ : కె.కె.రాధామోహ‌న్‌

నిర్మాణ సంస్థ‌ : శ‌్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌

ద‌ర్శ‌క‌త్వ : కె.చ‌క్ర‌వ‌ర్తి

మాస్ హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ‘పంతం’ అంటూ మన ముందుకొస్తున్నాడు. ఈ మూవీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించగా.. సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త డైరెక్టర్ కె. చక్రవర్తి గోపీచంద్‌కి హిట్ అందించాడో లేదో చూద్దాం.

కథ : ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్ట‌ర్ జ‌యేంద్ర (సంప‌త్‌), హెల్త్ మినిస్ట‌ర్ (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి). వారిద్ద‌రి డ‌బ్బును ప్లాన్ వేసి కొట్టేస్తుంటాడు గోపీచంద్‌. ఓసారి మినిస్ట‌ర్ కాన్వాయ్ నుంచి, మ‌రోసారి రైలు భోగీ నుంచి, ఇంకోసారి మినిస్ట‌ర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ద‌గ్గ‌ర దాచిన డ‌బ్బు ... ఇలా చాలా విధాలుగా కోట్ల రూపాయాల‌ను కొట్టేస్తుంటాడు. త‌మ డ‌బ్బును కొట్టేసిన వ్య‌క్తి ఎవ‌రో ఒకానొక స‌మ‌యంలో జ‌యేంద్ర‌కు తెలుస్తుంది. అయితే ఆ వ్య‌క్తి మామూలు వాడు కాద‌నీ, ప్ర‌పంచంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఒక‌రైన సురానా ఇండ‌స్ట్రీ అధినేత కుమారుడ‌ని అర్థ‌మ‌వుతుంది. అంత డ‌బ్బున్న వ్య‌క్తి కుమారుడికి ఇలా హోమ్ మినిస్ట‌ర్ డ‌బ్బును దొంగ‌లించాల్సిన అవ‌స‌రం ఏంటి? అత‌నికి అనాథాశ్ర‌మానికి లింకేంటి? అత‌ను కొట్టేసిన డ‌బ్బును ఏం చేశాడు? డొనేష‌న్లు కూడా అవ‌స‌రం లేనంత‌గా త‌రాలు తినేలా నిధులున్న అనాథాశ్ర‌మానికి అత‌ని వ‌ల్ల క‌లిగిన ఉప‌యోగం ఏంటి? ఆ అనాథ ఆశ్ర‌మం అత‌నికి ఎలా ఉప‌యోగ‌ప‌డింది వంటివ‌న్నీ స‌స్పెన్స్. చెప్పుకోవ‌డానికి కొత్త క‌థ కాదు అని ఈ సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది. మ‌రి కొత్త క‌థ కాని క‌థ‌ను తెర‌మీద ద‌ర్శ‌కుడు ఎలా కొత్త‌గా చెప్పాడ‌నేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ : విదేశాల్లోని కోటీశ్వ‌రుడైన ఆ యువ‌కుడు త‌న స్వ‌దేశం వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ ప్ర‌జ‌ల ప‌రిస్థితి చూసి బాధ ప‌డ‌టం. అందుకు కార‌ణ‌మైన రాజ‌కీయ నాయ‌కుల ప‌ని ప‌ట్ట‌డ‌మే ప్ర‌ధాన క‌థాంశంగా పంతం సినిమా సాగుతుంది. గోపీచంద్ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో మెప్పించాడు. ఒక‌వైపు కోటీశ్వ‌రుడిగా.. మ‌రోవైపు రాజ‌కీయ నాయ‌కుల న‌ల్ల‌ధ‌నాన్ని దోచుకునే దొంగ‌గా మెప్పించాడు. లుక్స్ ప‌రంగా చూడ‌టానికి బావున్నాడు. క్లైమాక్స్ సీన్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పే సంద‌ర్భలోనూ గోపీచంద్ న‌ట‌న ప్ర‌శంస‌నీయం. ఇక మెహ‌రీన్ పాత్ర పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఫ‌స్టాఫ్‌లో ఆమె రోల్ ఎక్కువ సేపు తెర‌పై క‌న‌ప‌డినా.. సెకండాఫ్‌లో పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. సినిమాలో కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌దు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్ : గోపీచంద్ యాక్టింగ్ 

                         డైలాగులు

మైనస్ పాయింట్స్ : పాటలు 

రేటింగ్ : 2.5/5