ఆఫీసర్ మూవీ రివ్యూ

నటినటులు : నాగార్జున అక్కినేని, మైరా సరీన్‌, అజ‌య్‌, షాయాజీ షిండే, ఫిరోజ్ అబ్బాసీ, బేబి కావ్య 

సంగీతం : ర‌విశంక‌ర్‌

ఛాయాగ్ర‌హ‌ణం : ఎన్‌.భ‌ర‌త్‌వ్యాస్‌, రాహుల్ పెనుమ‌త్స‌

కూర్పు : అన్వ‌ర్ అలీ, ఆర్‌.క‌మ‌ల్‌

ద‌ర్శ‌క‌త్వ : రామ్‌గోపాల్ వ‌ర్మ‌

నిర్మాత‌లు : రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర‌

నిర్మాణ సంస్థ‌ : ఎ కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌

నాగార్జున‌, రామ్‌గోపాల్ వ‌ర్మ అన‌గానే ఎవ‌రికైనా గుర్తుకొచ్చే సినిమా పేరు `శివ‌`. చాల రోజుల తరువాత వీరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. మరి నాగార్జున ఆఫీసర్ గా వచ్చి ప్రేక్షకులను ఎంత వ‌ర‌కూ మెప్పించాడో చూడాలి...

కథ : నారాయ‌ణ ప‌సారి ముంబైలో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌. నారాయ‌ణ ప‌సారి ఓ ఫేక్ ఎన్‌కౌంట‌ర్ చేశాడ‌నే కేసు వేస్తారు కొంద‌రు. దాంతో హైకోర్టు ఆయ‌న‌పై ఓ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ టీమ్‌కు హైద‌రాబాద్‌కు చెందిన శివాజీరావ్‌(నాగార్జున‌)ను పై అధికారిగా నియ‌మిస్తారు. ముంబై వ‌చ్చిన శివాజీ కేసును ప‌రిశోధించి ఓ సాక్ష్యాన్ని సేక‌రిస్తాడు. దాంతో నారాయ‌ణ ప‌సారిని అరెస్ట్ చేస్తారు కూడా. ఓ అండ‌ర్‌వ‌రల్డ్ టీంను క్రియేట్ చేసి న‌గ‌రంలో పేరు మోసిన వ్య‌క్తుల‌ను చంపించేస్తాడు నారాయ‌ణ ప‌సారి. దాంతో ప్ర‌భుత్వ ఓ స్పెష‌ల్ ఎన్‌కౌంట‌ర్ టీమ్‌ను ఏర్పాటు చేసి దానికి నారాయ‌ణ‌ను చీఫ్‌ను చేస్తారు. నారాయ‌ణ తెలివిగా గేమ్ ఆడి శివాజీకి, అండ‌ర్ వ‌ర‌ల్డ్ టీంకు సంబంధం ఉంద‌ని అంద‌రినీ న‌మ్మిస్తాడు. అప్పుడు శివాజీ ఏం చేస్తాడు? త‌న‌పై ప‌డ్డ నింద నుంచి ఎలా త‌ప్పించుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలి. 

విశ్లేషణ : నాగ్‌, వ‌ర్మ సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో క‌చ్చితంగా కొన్ని అంచనాలు ఉంటాయి అనడం లో సందేహం లేదు. అదే అంచ‌నాల‌తోనే సినిమా రూపొందింది. అయితే సినిమా క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తీస్తాన‌ని.. వ‌ర్మ ప్ర‌తిజ్జ చేశాడు కానీ సినిమాను త‌నకు న‌చ్చిన గ్యాంగ్‌స్ట‌ర్స్ మూవీ త‌ర‌హాలోనే తెరెక్కించాడు. చైల్డ్ సెంటిమెంట్‌, ఎమోష‌న్స్ ఉన్నాయంటే ఉన్నాయ‌నిపిస్తాయి..

ప్లస్ పాయింట్స్ : నాగార్జున నటన 

మైనస్ పాయింట్స్ : సెకండాఫ్

 


మరిన్ని కథనాలు

పోస్ట్...
ప్రభాస్ చేతుల...
డైరెక్టర్ మారుతి...
రంగస్దలం సెట్లొ...
డైరెక్టర్ గా...
‘సాహో’లో బాలీవుడ్...