ఎన్టీఆర్‌ కొత్త సినిమా కోసం ఏం చేసాడో తెలుసా .....

ఎన్టీఆర్‌ కొత్త సినిమా కోసం ఏం చేసాడో తెలుసా .....

తాతకు తగ్గ మనవుడు అనిపించుకోవటానికి జూనియర్ ఎన్టీఆర్‌ తెగ కష్టపడిపోతున్నాడు . ఇందుకోసం తన శరీరాకృతిపై దృష్టి సారించాడు. దీని కోసమే కొత్త అవతారంలో కనిపించేందుకు ప్రత్యేక ట్రైనర్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలో సీనియర్ ఎన్టీఆర్‌ ఎలా చక్కటి పాత్రలు వేసి రక్తి కట్టించారో అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్‌ పయనిస్తున్నాడు. తన కాయాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు వెంటనే అది'యమదొంగ'లో చూపించాడు. 

'టెంపర్‌'లో సిక్స్‌ ప్యాక్‌తో మెరిశాడు. విభిన్నమైన పాత్రలతో 'జై లవకుశ'లోనూ మెప్పించాడు. ఈసారి చేసేది కుటుంబ కథా చిత్రమైనా పాత్రలో కొత్తదనం కోసం ఇప్పటికి నాలుగు నెలలుగా శ్రమిస్తున్నాడు. ఇదంతా త్రివిక్రమ్‌ దర్శకత్వ౦ లో తెరకెక్కనున్న చిత్రం కోసం మార్చి రెండో వారం నాటికి ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టు సిద్ధమైపోతాడు ఎన్టీఆర్‌. అందుకే ఈ చిత్రం షూటింగ్‌కు మార్చిలో ముహూర్తం ఖరారు చేశారు. ఎన్టీఆర్‌ను కొత్త గెటప్‌లో చూపించడం కోసం హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్ వెల్‌ను ఈ సినిమాకు పని చేయిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ బాణీలు సమకూర్చారు. ఇక వచ్చే నెలలో సెట్స్ పైకి వెళితే , అందరి దృష్టి ఎన్టీఆర్‌ పైనే కేంద్రీకృతం కానుంది.