‘ఎన్టీఆర్‌ 28’ సినిమా షూటింగ్ రేప‌టి నుంచే..!

‘ఎన్టీఆర్‌ 28’ సినిమా షూటింగ్ రేప‌టి నుంచే..!

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్‌ ఎప్పుడూ చూడని గెటప్‌లో కన్పించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొత్త లుక్‌ కోసం తారక్‌ జిమ్‌లో కష్టపడుతున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ శుక్ర‌వారం నుంచి ప్రారంభం కాబోతోందని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. సినిమాలో తారక్‌ లుక్‌ చూసి ప్రేక్షకులు కచ్చితంగా సర్‌ప్రైజ్‌ అవుతారని అంటున్నారు. ఇందులో తారక్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటించబోతున్నారు.