fingoshop
fingoshop

నివేదా తన డేర్ ఏంటో చూపించింది

నివేదా తన  డేర్ ఏంటో చూపించింది

టాలీవుడ్ నటి నివేదా థామస్ సోషల్ మీడియా పోస్ట్ కు విశేష స్పందన లభిస్తోంది. నివేదా  ఓ కొండచిలువతో హాయిగా ఆడుకుంటూ కొన్ని ఫొటోలు దిగింది. కొండచిలువను కలిశాను. చాలా చిన్న విషయం. నేను అనుకున్నంత చిన్న విషయమేం కాదంటూ కొండ చిలువతో దిగిన ఫొటోలను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేసింది .

ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న నటి ఇలా ప్రమాదకర ప్రాణులతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుందని  నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా, నాని హీరోగా నటించిన జెంటిల్‌మెన్ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఆపై నిన్నుకోరి, జైలవకుశ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించారు.