నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ల ' సూర్యకాంతం'

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ల ' సూర్యకాంతం'

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ' సూర్యకాంతం' చిత్రం మార్చి 29 న విడుదల కానుంది.. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.. చిత్రీకరణ పూర్తికాగా, నిర్మాణానంతర కార్యక్రమాలు శెరవేగంగా జరుగుతున్నాయి.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ, ఈరోజే రిలీజ్ అయిన టీజర్ ఫీల్ గుడ్ గా , రీ ఫ్రెషింగ్ గా ఉందంటూ కితాబు అందుకుంటుంది.. శివాజీ రాజా, సుహాసిని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు.. అమెరికాలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.. 

నటీనటులు : నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియా , శివాజీ రాజా, సుహాసిని, సత్య

సాంకేతిక నిపుణులు :

సమర్పణ : వరుణ్ తేజ్

దర్శకుడు : ప్రణీత్ బ్రమండపల్లి 

నిర్మాతలు : సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్

బ్యానర్ : నిర్వాణ సినిమాస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజ్ నిహార్

సినిమాటోగ్రాఫర్ - హరిజ్ ప్రసాద్

సంగీతం - మార్క్ కె రాబిన్

ఆర్ట్ డైరెక్టర్- అవినాష్ కొల్ల

సాహిత్యం - కృష్ణ కాంత్

ఎడిటర్ - రవితేజ గిరిజాల