శ్రీరెడ్డికి అండగా నిలిచిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌

శ్రీరెడ్డికి అండగా నిలిచిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌

సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ గళమెత్తిన నటి శ్రీరెడ్డిని సినిమాల నుంచి బహిష్కరిస్తూ 'మాతీసుకున్న నిర్ణయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తప్పు పట్టింది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం ముమ్మాటికీ ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యలో తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసార శాఖలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. కాగా, కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను శ్రీరెడ్డి ఆశ్రయించకపోయినప్పటికీ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు ఆధారంగా కమిషనే ఆమె కేసును సుమాటోగానే స్వీకరించింది . కాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ తనపై అత్యాచారం చేశారని నటి శ్రీరెడ్డి నిన్న ఆరోపించారు. తనతో కలిసి మెలిసి తిరిగి , ఓ రోజు వారి సినీ స్టూడియోకి తీసుకెళ్లి , సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పి తనను రేప్ చేశారని ఆరోపించింది. ఈ ఘటన ఐదేళ్ల క్రితమే జరిగిందని చెప్పుకొచ్చింది ఆమె.