మూగవాడిగా నారా రోహిత్

మూగవాడిగా నారా రోహిత్

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్‌.శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాణంలో రూపొందనున్న తాజా చిత్రంలో నారా రోహిత్ మూగవాని పాత్రలో కనిపించనున్నారు. ఇది నారా రోహిత్ నటించబోయే పద్దెనిమిదవ చిత్రం. ఉగాదికి ప్రారంభం కానున్న ఈ చిత్రానికి పిబి మంజునాథ్ దర్శకత్వ౦ వహిస్తారు.వికాస్ కురుమెళ్ల సినిమాకు సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ పరుచూరి మురళి దర్శకత్వ౦లో ఆటగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు.