ఏడుండార్రా గోపికలు.. అంటున్న నాని

ఏడుండార్రా గోపికలు.. అంటున్న నాని

హీరోగా, నిర్మాతగా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు నాని. ఎంసీఏ సినిమా సక్సెస్ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.కృష్ణార్జున యుద్ధంలో నాని  ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వ౦లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మాస్‌ కుర్రాడిగా కనిపిస్తే మరో పాత్రలో ఫారిన్‌ లో ఉండే రాక్‌ స్టార్‌ల కనిపిస్తున్నాడు.టీజర్‌లో నాని రొమాంటిక్ హీరోగా.. మోడ్రన్ కృష్ణుడిగా చూపించారు. ‘రామాయణం అంతా విని ధర్మరాజు ఎవరని అడిగిందట నీ లాంటి సోంబేరి మొహంది’ అంటూ మంచి కామెడీని కూడా పండించాడు నాని.అనుపమా పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హిప్‌ హాప్‌ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్నది.