నాగార్జున ఆఫీసర్ వాయిదా

నాగార్జున ఆఫీసర్ వాయిదా

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వ౦లో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘ఆఫీసర్’. చాలా కాలం తర్వాత నాగ్‌ పోలీస్‌ గెటప్‌లో నటించడం..25 ఏళ్ల తర్వాత వర్మ-నాగ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘క్వాలిటీ పరంగా సినిమాను అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతోంది. అందుకే నాగార్జున ఆఫీసర్‌ సినిమాను మే 25న కాకుండా జూన్‌ 1న రిలీజ్‌ చేయాలని నిర‍్ణయించాం’ అని వర్మ ట్వీట్  చేసారు.