న్యూయార్క్ లో నాగచైతన్య "సవ్యసాచి"

న్యూయార్క్ లో నాగచైతన్య "సవ్యసాచి"
నటినటులు : నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం : యువరాజ్
కళ : రామకృష్ణ
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర్రావు
పోరాటాలు : రామ్-లక్ష్మణ్
సహాయ దర్శకుడు : చలసాని రామారావు
సి.ఈ.ఓ : చిరంజీవి (చెర్రీ)
లైన్ ప్రొడ్యూసర్ : పి.టి.గిరిధర్
సహ నిర్మాత : ప్రవీణ్.ఎం
నిర్మాతలు : నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ చెరుకూరి (సి.వి.ఎం)
కథ-మాటలు-చిత్రానువాదం-దర్శకత్వ౦ : చందు మొండేటి
హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య అక్కినేని, హ్యాట్రిక్ డైరెక్టర్ చందు మొండేటి ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "సవ్యసాచి". మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. మాధవన్, భూమికలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించడం విశేషం. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం న్యూయార్క్ లో జరుగుతోంది. ఒక పాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనున్న ఈ కీలకమైన షెడ్యూల్ 15 రోజులపాటు సాగనుంది. 

"సవ్యసాచి" ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పదన వచ్చింది. "ప్రేమమ్" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చైతూ-చందుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో "సవ్యసాచి"పై భారీ అంచనాలున్నాయి. న్యూయార్క్ లో 15 రోజులపాటు నిరవధికంగా జరగనున్న చివరి షెడ్యూల్ తో చిత్రీకరణ ముగుస్తుంది. చందు మొండేటి "సవ్యసాచి"ని ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా హై టెక్నికల్ వేల్యూస్ తో మలుస్తున్న తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా జతకడుతున్న ఈ చిత్రంలో మాధవన్ కీలకపాత్ర, చైతూ అక్కగా భూమిక పాత్ర ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. "బాహుబలి" అనంతరం ఎం.ఎం.కీరవాణి సంగీత సారధ్య వహిస్తున్న చిత్రం "సవ్యసాచి" కావడం విశేషం. అన్నిటికంటే ముఖ్యగా "రంగస్థలం" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నుంచి వస్తున్న చిత్రం "సవ్యసాచి" కావడం విశేషం.