నాగార్జున సూపర్ మాస్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న నాగచైతన్య

నాగార్జున సూపర్ మాస్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న నాగచైతన్య
నటినటులు : నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫీ : యువరాజ్
కళ : రామకృష్ణ
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర్రావు
పోరాటాలు : రామ్-లక్ష్మణ్
కో-డైరెక్టర్ : చలసాని రామారావు
సి.ఈ.ఓ : చిరంజీవి (చెర్రీ)
లైన్ ప్రొడ్యూసర్ : పిటి.గిరిధర్
నిర్మాతలు : వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (CVM)
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వ : చందూ మొండేటి
నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన "అల్లరి అల్లుడు" చిత్రంలోని "నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు" అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్ ను యువసామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం "సవ్యసాచి"లో రీమిక్స్ చేస్తున్నాడు. "శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం" చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వ వహిస్తున్నారు. "నిన్ని రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు" రీమిక్స్ లో చైతూతో ఓ అగ్ర కథానాయకి ఈ పాటలో చిందేయనుంది. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు దర్శకనిర్మాతలు. ఒరిజినల్ వెర్షన్ ను కంపోజ్ చేసిన కీరవారి ఈ రీమిక్స్ వెర్షన్ కి కూడా సంగీత దర్శకులు అవ్వడం విశేషం. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది.