"నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" మూవీ రివ్యూ

టైటిల్ : నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

తారాగణం : అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యూయేల్‌, అర్జున్‌, శరత్ కుమార్‌, బొమన్‌ ఇరానీ, రావూ రమేష్‌

సంగీతం : విశాల్‌ - శేఖర్‌ 

కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగులు, దర్శకత్వ౦ : వక్కంతం వంశీ

నిర్మాత : లగడపాటి శ్రీధర్‌, నాగబాబు, బన్నీ వాసు

యువతలో మంచి క్రేజ్‌ ఉన్న కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన స్టైల్‌, డ్యాన్సులకు యూత్‌ చాల ఫాస్ట్ గా  కనెక్ట్‌ అవుతారు. వక్కతం వంశీ దర్శకత్వలో అల్లు అర్జున్  కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. తొలిసారిగ అల్లు అర్జున్  ఆర్మీ అధికారి పాత్రలో నటించారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎలా ఉందో చూడాలి.

కథ : సూర్య(అల్లు అర్జున్‌) ఒక సైనికుడు. కోపం ఎక్కువ. చిన్న తప్పు జరిగినా తట్టుకోలేని మనస్తత్వ. హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బోర్డర్‌ వెళ్లాలన్నదే అతడి లక్ష్య. ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు. దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి బయటకు పంపించాలని కల్నల్‌(బొమన్‌ ఇరానీ) నిర్ణయిస్తాడు. కానీ, అందుకు ఒప్పుకోని సూర్య తన గాడ్‌ ఫాదర్‌(రావురమేష్‌)ను రంగంలోకి దింపుతాడు. అంతా బాగానే ఉందని వైజాగ్‌లో ఉన్న సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు(అర్జున్‌) దగ్గర సంతకం తీసుకొస్తే బోర్డర్‌కు పంపుతానని కల్నల్‌ చెబుతాడు. రామకృష్ణంరాజు 21రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు.  చల్లాతో గొడవలు పెట్టుకుంటాడు. ఇంతకీ రామకృష్ణంకు సూర్యకు మధ్య సంబంధం ఏంటి..? సూర్య తన క్యారెక్టర్‌ని వదులుకొని తిరిగి ఆర్మీలో చేరాడా? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ : అల్లు అర్జున్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం సరికొత్తగా ఉంది. ఇక ‘ఫస్ట్‌ ఇంపాక్ట్‌’, ‘ట్రైలర్‌’లలో చూపించినట్లు యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఆర్మీ ట్రైనింగ్‌ సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. పాత్ర కోసం బన్ని పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తొలి భాగాన్ని ఆసక్తికరంగా నడిపించిన వంశీ, ద్వితీయార్థంలో మాత్రం కాస్త తడబడ్డాడు. సెకండ్‌ హాఫ్‌ కథనం కాస్త నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బది పెడుతుంది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేదు. వంశీ రాసిన డైలాగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్ : అల్లు అర్జున్‌ నటన 

                         యాక్షన్‌ సన్నివేశాలు 

                         ఆర్మీ ట్రైనింగ్‌

                          బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌

మైనస్ పాయింట్స్ : సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్లు


మరిన్ని కథనాలు

సల్మాన్‌కు జోధ్‌పూర్‌ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది...
సల్మాన్‌కు...
బంగారి బాలరాజు...
న‌టీనటులెవ‌రైనా ఈ...
లవర్స్ అడ్డా...
నాగార్జున కొత్త...
దేశం లో దొంగలు...