నా నువ్వే మూవీ రివ్యూ

నా నువ్వే మూవీ రివ్యూ

తారాగ‌ణం : న‌ంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా, పోసాని కృష్ణ‌ముర‌ళి, , త‌నికెళ్ల‌ భ‌ర‌ణి, వెన్నెల‌కిశోర్, సురేఖా వాణి 

సంగీతం : శ‌ర‌త్‌

సినిమాటోగ్ర‌ఫీ : పి.సి.శ్రీరామ్‌

కూర్పు : టి.ఎస్‌.సురేశ్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే : జ‌యేంద్ర శుభ‌

ద‌ర్శ‌క‌త్వ : జ‌యేంద్ర‌

నిర్మాత‌లు : కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి

స‌మ‌ర్ప‌ణ‌ : మ‌హేశ్ కోనేరు

నిర్మాణ సంస్థ‌ : కూల్ బ్రీజ్ సినిమాస్‌

ఇన్నాళ్లు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను మాత్ర‌మే చేస్తూ వ‌చ్చిన క‌ల్యాణ్ రామ్ స‌డెన్‌గా యూ ట‌ర్న్ తీసుకుని చేసిన‌ పూర్తిస్థాయి రొమాంటిక్ టైన‌ర్ `నా నువ్వే`.`ప‌టాస్‌`హిట్  త‌ర్వాత త‌న‌కు చెప్పుకునే స్థాయిలో విజ‌యాలు మాత్రం ద‌క్కలేదు అస‌లు క‌ల్యాణ్ రామ్ రొమాంటిక్ సినిమాల‌కు సూట్ అవుతాడా? అనే ప్రశ్న కు సమాధానం దొరకాలంటే కథ లో కి వెళ్ళాల్సిందే...

కథ : మీరా(త‌మ‌న్నా) రెడియో జాకీ. ప్రేమికుల రోజు సంద‌ర్భగా 36 గంట‌ల రేడియో మార‌థాన్ స్టార్ట్ చేస్తుంది. వ‌రుణ్‌(నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌) పి.హెచ్‌.డి చేసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. అయితే ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్ర‌తిసారి వ‌రుణ్‌ ఏదో ఒక కార‌ణంతో ఫ్లైట్ మిస్ చేసుకుంటూ ఉంటాడు. వ‌రుణ్ బామ్మ క‌ల్యాణి త‌న‌కు పెళ్లి చేయాల‌ని ల‌వ్ సైన్ పుస్త‌కం కొంటుంది. ఓ సంద‌ర్భలో దాన్ని వ‌రుణ్ చ‌ద‌వ‌డానికని తీసుకుంటాడు. ఆ పుస్త‌కాన్ని ట్రెయిన్‌లోనే మ‌ర‌చిపోతాడు. అది అనుకోకుండా మీరాకి దొరుకుతుంది. మీరా కూడా ఆ పుస్తకాన్ని ఇంకేవ‌రికో ఇచ్చేసినా కూడా అది మీరా ద‌గ్గ‌రికి మ‌ళ్లీ చేరుకుంటుంది. త‌న‌కు, ఆ పుస్త‌కంతో ఏదో రిలేష‌న్ ఉంద‌ని న‌మ్ముతుంది. ఆ పుస్త‌కం ఓపెన్ చేయ‌గానే అందులో వరుణ్ ఫోటోను చూస్తుంది. వ‌రుణ్‌ని చూడ‌గానే త‌ను అప్ప‌టి వ‌ర‌కు పాస్ కానీ ఎగ్జామ్స్ పాస్ అయిపోవ‌డం స‌హా కొన్ని ప‌నులు జ‌రిగిపోతాయి. దాంతో వ‌రునే త‌న ల‌క్కీ అని మీరా బ‌లంగా న‌మ్మి అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. వ‌రుణ్‌ని క‌లుసుకుని త‌న‌కు జ‌రిగిన అనుభ‌వాలు చెప్పి ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తుంది. అయితే వరుణ్ మీరా కు ఒక కండిషన్ పెడుతాడు. ఆ కండిషన్ ఏంటి..ఆ కండిషన్ కి మీరా ఓకే చెప్పి వరుణ్ ప్రేమను గెలుచుకుంటుందా లేదా అన్నది చూడాలి.

విశ్లేషణ : శ‌ర‌త్ సంగీతం బావుంది.  ఇక పి.సి.శ్రీరామ్ తీసిన ప్రతి విజువ‌ల్ బ్యూటీఫుల్‌గా అనిపిస్తుంది. క‌ల్యాణ్‌రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.క‌ల్యాణ్‌రామ్ కొత్త లుక్ బాగుంది.వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, సురేఖావాణి, పోసాని కృష్ణ‌ముర‌ళి చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించి ప‌రిధి మేర‌కు న‌టించారు.

ప్లస్ పాయింట్స్పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్స్

                                పాట‌లు

మైనస్ పాయింట్స్క‌థ, క‌థ‌నం