'నా కథలో నేను' ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసిన స్టార్‌ రైటర్‌ వి.విజయేంద్ర ప్రసాద్‌

'నా కథలో నేను' ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసిన స్టార్‌ రైటర్‌ వి.విజయేంద్ర ప్రసాద్‌
కెమెరా : లక్క ఏకారి
సంగీతం : నవనీత్‌
పాటలు : మోనిక ఏకారి
రచన నిర్మాత, దర్శకత్వ : శివప్రసాద్‌ గ్రంధే
సాంబశివ హీరోగా సంతోషి శర్మ హీరోయిన్‌గా జి.ఎస్‌.కె. ప్రొడక్షన్‌ పతాకంపై శివ ప్రసాద్‌ గ్రంధే స్వీయ దర్శకత్వలో రూపొందించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నా కథలో నేను'. నవనీత్‌ సంగీత సారధ్యలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌లోని మొదటి పాటను స్టార్‌ రైటర్‌ వి.విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాంబశివ, హీరోయిన్‌ సంతోషి శర్మ, దర్శక నిర్మాత శివప్రసాద్‌ గ్రంధే, సంగీత దర్శకుడు నవనీత్‌ తదితరులు పాల్గొన్నారు. మిగతా నాలుగు పాటలను కూడా త్వరలో రిలీజ్‌ చేసి అతి త్వరలో సినిమాని రిలీజ్‌ చేయనున్నారు. 
ఈ సందర్భగా స్టార్‌ రైటర్‌ వి. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ - ''నా కథలో నేను' చిత్రం మొదటి పాట చాలా బాగుంది. నవనీత్‌ సంగీతం చాలా వినసొంపుగా వుంది. క్రొత్త వాళ్లు అయినా అందరూ బాగా చేశారు. శివప్రసాద్‌ ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించాడు. అతని ప్రయత్న సక్సెస్‌ కావాలి. ఈ చిత్రం సక్సెస్‌ అయి ఈ టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 
దర్శక నిర్మాత శివప్రసాద్‌ గ్రంధే మాట్లాడుతూ - ''చిన్న సినిమా అయినా కూడా అడిగిన వెంటనే మా కోరిక మన్నించి మా చిత్రంలోని మొదటి పాటని రిలీజ్‌ చేసిన విజయేంద్రప్రసాద్‌ గారికి మా కృతజ్ఞతలు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని అందరికీ నచ్చే విధంగా తెరకెక్కిచాం. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాని రిలీజ్‌ చేస్తాం'' అన్నారు. 
సంగీత దర్శకుడు నవనీత్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో నాలుగు పాటలు వున్నాయి. మొదటి పాటని విజయేంద్ర ప్రసాద్‌గారు రిలీజ్‌ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత శివప్రసాద్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.