అభిమానులకు వార్నింగ్‌

అభిమానులకు వార్నింగ్‌

మెహరీన్‌ తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తన పేరును ఓ అభిమాని మెడపై పచ్చ బొట్టు వేయించుకున్న ఓ ఫొటోను ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. తన కోసం ఇలాంటి పనులు చేయవద్దని, ఇందుకోసం మిమ్మల్ని మీరు బాధించుకోవద్దంటూ తన ట్వీట్ ద్వారా అభిమానులను కోరింది.. మరోవైపు ఎంత అభిమానం అంటూ ఆశ్చర్య వ్యక్తం చేసింది. ఫ్యాన్ లవ్, బిగ్ థ్యాంక్యూ అని హ్యాష్‌ట్యాగ్స్‌తో ఐ లవ్‌ యూ ఆల్‌ అని తన అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్త పరిచింది.