నాగ‌చైత‌న్య‌, స‌మంత, శివ నిర్వాన మ‌జిలి సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌...

నాగ‌చైత‌న్య‌, స‌మంత, శివ నిర్వాన మ‌జిలి సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌...

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ప్రేమ ఉంది.. బాధ ఉంద‌ని అర్థం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. నాగచైతన్య, సమంత లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. నిన్నుకోరి లాంటి ఎమోష‌న‌ల్ హిట్ సినిమా తెర‌కెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహు గ‌ర‌పాటి, హరీష్ రెద్ది  మజిలీ చిత్రాన్ని  షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు: 

అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: శివ నిర్వాన 

నిర్మాత‌లు: సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది 

సంస్థ‌: షైన్ స్క్రీన్స్

సంగీతం: గోపీ సుంద‌ర్ 

సినిమాటోగ్ర‌ఫ‌ర్: విష్ణు వ‌ర్మ‌

ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ 

ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి

యాక్ష‌న్: వెంక‌ట్