సితారతో డ్యాన్స్ అంటే మహేష్‌కు ఇష్టం: నమ్రత

సితారతో డ్యాన్స్ అంటే మహేష్‌కు ఇష్టం: నమ్రత

ఓ ఇంటర్వ్యూలో భాగంగా నమ్రత భరత్ అనే నేను సినిమా సక్సెస్ గురించి, అలాగే లీజర్ టైమ్‌లో మహేష్ తన పిల్లలతో ఎలా గడుపుతారో వెల్లడించారు. భరత్ అనే నేను సినిమా సక్సెస్ గురించి నమ్రత మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా మహేష్ కెరీర్‌లో చాలా పెద్ద సక్సెస్. లాస్ట్ రెండు సినిమాలు సక్సెస్ అవకపోవడంతో మహేష్ ఈ సినిమాకు పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. సితారతో డ్యాన్స్‌ చేయడం ఆయనకు ఇష్టం. గత కొన్ని వారాలుగా ఓ స్టెప్పు వేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ తండ్రీ కుమార్తెలు వేయలేకపోతున్నారు. గౌతమ్‌కు సిగ్గు ఎక్కువ. అచ్చ మహేష్ లగే . డ్యాన్స్‌ చేయమని మహేశ్‌ అతడ్ని బలవంతం చేస్తుంటాడు" అని చెప్పారు.మహేశ్‌ కుటుంబం ప్రస్తుతం విహారయాత్ర కోసం ప్యారిస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అందులో మహేశ్‌ తన ముద్దుల కుమార్తెను లాలిస్తూ కనిపించారు. మరో ఫొటోలో సితార తన తండ్రికి కబుర్లు చెబుతూ ఉంది.