మేడమ్‌ టుస్సాడ్స్‌లో మహేష్ ప్రతిమ !

మేడమ్‌ టుస్సాడ్స్‌లో మహేష్ ప్రతిమ !

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. లండన్‌లోని ప్రముఖ మేడమ్‌ టుస్సాడ్స్‌‌ మ్యూజియంలో మహేశ్‌ మైనపు విగ్రహం రాబోతోంది. ఈ విషయాన్ని మహేశ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు మ్యూజియం ప్రతినిధులు మహేష్ ను కలిసి ప్రతిమ కోసం అవసరమైన కొలతలు తీసుకున్నారు.‘ప్రఖ్యాతి గాంచిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో భాగం అవుతున్న౦దుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌లందరూ దగ్గరుండి నా వివరాలు సేకరించినందుకు ధన్యవాదాలు.’ అని ట్వీట్‌ చేశారు.మహేశ్‌కు ఈ గౌరవం దక్కడంతో అభిమానులు ఆనందంగా ఫీల్‌ అవుతున్నారు. ఇది వరకు టాలీవుడ్‌లో హీరో ప్రభాస్‌కు ఈ గౌరవం దక్కిన విషయం తెలిసిందే.