'మా ' అధ్యక్షుడిగా నరేష్ విజయం

'మా ' అధ్యక్షుడిగా నరేష్ విజయం

ఎంతో ఉంత్కంఠగా సాగిన ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికల ఫలితలు వెలువడ్డాయి. ‘మా’ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ గెలుపొందారు. తన ప్రత్యర్థి శివాజీ రాజాపై 69 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం నమోదైన ఓట్లలో 268 ఓట్లు నరేష్‌కు పోలవగా.. శివాజీ రాజాకు 199 ఓట్లు పడ్డాయి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్  సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై  రాజీవ్ కనకాల గెలుపొందారు. 

గెలుపొందిన ఈసీ మెంబర్స్ : 1). అలీ    2). రవిప్రకాష్   3). తనికెళ్ల భరణి 4). సాయికుమార్ 5). ఉత్తేజ్ 6). పృథ్వి 7). జాకీ 8).సురేష్ కొండేటి 9). అనితా చౌదరి 10). అశోక్ కుమార్ 11). సమీర్ 12). ఏడిద శ్రీరామ్  13).రాజా రవీంద్ర 14). తనీష్ 15). జయలక్ష్మి 16). కరాటి కళ్యాని 17). వేణుమాధవ్ 18). పసునూరి శ్రీనివాస్. ఆదివారం ‘మా’ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. మా అసోషియేషన్‌లో మొత్తం 745మంది సభ్యులు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా’ ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో తొలి ఓటును నటుడు నరేశ్‌ వేయగా.. చివరి ఓటును అలనాటి హాస్య నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు. సినీరంగానికి చెందిన ప్రముఖులంతా ఫిల్మ్‌ఛాంబర్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.