కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ వెనుక అసలు కథ

కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ వెనుక అసలు కథ

కోడి రామకృష్ణ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన తలకు కట్టుకునే క్లాత్‌. ఆయన తలకు క్లాత్‌ కట్టుకోవడం వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అది ఆయనకు చాలా సెంటిమెంట్ అట. ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో వెల్లడించారు. నా రెండో సినిమా షూటింగ్‌ కోవలం బీచ్‌ దగ్గర జరుగుతోంది. మిట్ట మధ్యాహ్నం ఎన్టీ రామారావు కాస్ట్యూమర్‌ మోకా రామారావు సెట్‌కు వచ్చారు. మీ నుదురు విశాలంగా ఉంది. ఎండకి ఎక్స్‌పోజ్‌ అవుతోందిఅంటూ తన జేబులోని రుమాలు తీసి ఇచ్చి కట్టుకోమన్నారు. ఆయన చెప్పారు కదాని రోజంతా ఆ రుమాలును తలకు కట్టుకున్నా. మరుసటి రోజు ఆ రుమాలును బ్యాండ్‌లా తయారుచేసి తీసుకొచ్చారు. ఈ బ్యాండ్‌కు మీకు ఏదో అనుబంధం ఉందండి. ఇది అందరికీ నప్పదు. మీకు బాగా సూటైంది. దీన్ని కట్టుకోకుండా ఉండొద్దుఅన్నారు.

అప్పటినుంచి షూటింగ్ సమయంలో బ్యాండ్‌ కట్టుకోవడం సెంటిమెంట్‌గా అయిపోయింది. నా గుర్తింపుగా మారిపోయింది. పోలీసులకు టోపి, రైతుకు తలపాగా ఎలాగో నాకు ఈ బ్యాండ్‌ అలా అన్నమాట. దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను. ఓ రోజు కె.బాలచందర్‌ మా సెట్‌కు వచ్చారు. అప్పుడు నేను తలకు పూలతో ప్రింట్‌ చేసున్న బ్యాండ్‌ కట్టుకున్నా. అది చూసి ఆగాగుఅన్నారు. ఎందుకంటే నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలింది. దాన్ని చూసి ఈ బ్యాండ్‌కు నీకు ఏదో అనుబంధం ఉంది. ఎంజాయ్ చెయ్అంటూ ఆశీర్వదించారుఅని వెల్లడించారు కోడి రామకృష్ణ.

మరిన్ని కథనాలు