కొబ్బరి మట్ట మూవీ రివ్యూ

చిత్రం: కొబ్బరిమట్ట

నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, ఇషికా సింగ్‌, షకీలామహేశ్‌కత్తి, గాయత్రి గుప్త తదితరులు

సంగీతం: సయీద్‌ కర్మాన్‌

సినిమాటోగ్రఫీ: ముజీర్‌ మాలిక్‌

దర్శకత్వం: రూపక్‌ రొనాల్డ్‌సన్‌

 

సంపూర్ణేష్‌బాబు... సోషల్‌ మీడియా వల్ల గుర్తింపు తెచ్చుకుని, చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న నటుడు.హృదయకాలేయంఅనే చిత్రంతో నవ్వించాడు. ఆ తరవాత హాస్యనటుడిగా కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు మరోసారి కథానాయకుడిగా అవతారం ఎత్తాడు.కొబ్బరిమట్టసినిమాతో. ఇందులో సంపూ... మూడు పాత్రల్లో కనిపించడం, ప్రచార చిత్రాల్లో మాస్‌ హీరోగా భారీ డైలాగులు చెప్పడం ఆకట్టుకున్నాయి. దాంతో ఈసారి ఎన్ని నవ్వులు పండిస్తాడో అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు హాస్య ప్రియులు. మరి సంపూ ఈసారి ఏం చేశాడు? కొబ్బరిమట్ట ఎలా ఉంది?

 

కథేంటంటే: పెదరాయుడు (సంపూర్ణేష్‌ బాబు)  ఊరికి పెద్ద దిక్కు. ఎవరికి ఏ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా ఎదురు నిలబడతాడు.. నిలదీస్తాడు.. చిత్ర విచిత్రమైన తీర్పులు చెబుతాడు. తన ముగ్గురు తమ్ముళ్లంటే ప్రాణం. ముగ్గురు భార్యలు కూడా. అయితే ఓ రోజు ఆండ్రాయుడు (సంపూర్ణేష్‌బాబు) వచ్చి..నువ్వే నా తండ్రివిఅంటూ పెదరాయుడు ముందు నిలబడతాడు. ఆండ్రాయుడు రాకతో పెదరాయుడు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఇంతకీ ఈ ఆండ్రాయుడు ఎవరు? పెదరాయుడుతో తనకున్న సంబంధం ఏమిటి? ఆండ్రాయుడు వచ్చాక పెదరాయుడు జీవితంలో ఏం జరిగింది? పాపారాయుడు (సంపూ)కీ వీళ్లకూ ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాలి.

 

ఎవరెలా చేశారంటే: సంపూ మూడు పాత్రలు చేసినా... మూడింటిలోనూ నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. సంపూ వేసిన వైరైటీ స్టెప్పులు ఆశ్చర్యపరుస్తాయి. విశ్రాంతి ముందు గుక్క తిప్పుకోకుండా చెప్పిన మూడున్నర నిమిషాల డైలాగ్‌ ప్రధాన ఆకర్షణ. సంపూని మినహాయిస్తే ఏ పాత్రనీ దర్శకుడు పట్టించుకోలేదు. ప్రతీ నటుడూ సంపూకి మించి ఓవరాక్షన్‌ చేయాలని ప్రయత్నించినట్టే కనిపిస్తుంది. పాటలూ వినోదం కోసమే కాబట్టి.. అందులో తప్పొప్పులు, సాహిత్య విలువల గురించి మాట్లాడడం అనవసరం. చిన్న సినిమా ఇది. బడ్జెట్‌ పరిమితులు కనిపిస్తూనే ఉంటాయి. డైలాగుల్లో వ్యంగ్యం బాగా పండింది.

 

బలాలు

సంపూ

కొన్ని డైలాగులు

 

 

బలహీనతలు

కథ, కథనాలు

మిగిలిన నటీనటులు

మరిన్ని కథనాలు

రజినీకాంత్ "పేట"...
"ఏబీసీడీ" మూవీ...
రామ్, పూరిజగన్నాధ్...
డియర్ కామ్రేడ్ ...
త‌మ‌న్నా, ఓంకార్...