జయలలిత బయోపిక్‌ పై క్లారిటీ ఇచ్చిన కీర్తి

జయలలిత బయోపిక్‌ పై క్లారిటీ ఇచ్చిన కీర్తి

మ‌హాన‌టి సావిత్రి నిజ‌జీవిత క‌థలో కీర్తి జీవించింది. దీంతో మ‌రో ప్ర‌ముఖ తార బ‌యోపిక్‌లో కూడా కీర్తి న‌టించ‌బోతోందంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె జీవితం ఆధారంగా సినిమా తీస్తామని ఇప్పటికే పలువురు దర్శకులు ముందుకు వచ్చారు. అయితే ఏ ప్రాజెక్టూ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ వార్త‌ల‌పై తాజాగా కీర్తి స్పదించింది. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో తాను న‌టిస్తున్నానంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను ఆమె ఖండించింది. అస‌లు ఆ బ‌యోపిక్‌కు సంబంధించి త‌న‌నెవరూ సంప్ర‌దించ‌లేద‌ని వెల్ల‌డించింది. ఇదిలా ఉండగా జయలలిత  ఓ ఇంటర్వ్యూ లో యాంకర్‌.. జయలలితను బయోపిక్‌ గురించి ప్రశ్నించగా దీనికి ఆమె ఐశ్వర్యరాయ్‌ అయితే తన పాత్రకు సరిపోతారని అన్నారు.