కౌషల్ నందిని రొమాన్స్...

బిగ్ బాస్‌ హౌస్ లో రొమాన్స్... ఎమోషన్స్.. యాక్షన్... ఐటమ్ సాంగ్స్... లవ్ ప్రపోజ్.. ఇలా ఒక్కటేమిటి నవరసాల్ని పిండేస్తున్నారు కంటెస్టెంట్స్. ఒకర్నిమించి ఒకరు రెచ్చిపోయి నటించేస్తున్నారు. బిగ్ బాస్ టాస్క్‌లో భాగంగా ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ సినిమాను హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీర లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ కథలో భాగంగా కౌశల్.. నందినికి లవ్ ప్రపోజ్‌ అండ్ రొమాంటిక్ సీన్స్ అదుర్స్ అనిపించారు. కౌశల్‌ తన ప్రేమను వ్యక్తపరచడం నందిని అదే రీతిలో సిగ్గుపడుతూ అతడి ప్రపోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్ట్రాంగ్ హగ్ ఇవ్వడంతో రొమాంటిక్ సీన్స్ బాగా పండాయి.

దీప్తి సునైనా, సామ్రాట్ ఐటమ్ సాంగ్‌తో ఊపేశారు.. 

ఇక ఐటమ్ సాంగ్‌లో భాగంగా తేజస్వి డాన్స్ ట్రైనింగ్‌లో దీప్తి సునైనా, సామ్రాట్‌లు రింగ.. రింగా సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ముఖ్యగా దీప్తి సునైనా పాటకి తగ్గ క్యాస్ట్యూమ్స్‌ డాన్స్‌తో రచ్చ చేసేసింది. సామ్రాట్‌ని డానినేట్ చేస్తూ.. బిగ్ బాస్ హౌస్‌ని మాస్ స్టెప్పులతో షేక్ చేసింది. చివర్లో సామ్రాట్ బుగ్గపై ముద్దును కూడా ఇచ్చేసింది దీప్తి. అనంతరం తనీష్, సామ్రాట్‌ల మధ్య యాక్షన్ సీన్‌తో సినిమా షూట్ ముగిసిందని.. డైరెక్టర్ అమిత్ ఎడిటింగ్ కోసం బిగ్ బాస్‌కి పంపించారు. త్వరలో ఈ సినిమా ఎలా వచ్చిందో ప్రివ్యూ చూపించాలని అమిత్ కోరడంతో ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ సినిమా టాస్క్ ముగిసింది

ముందు ఉంది ముస్సల్ల పండుగ అన్నట్టు.....

ఇప్పటికే హౌస్ నిండి 16 మంది సెలబ్రిటీలలో సంజనా, నూతన్ నాయుడు, కిరీటి, భానుశ్రీ, యాంకర్ శ్యామల ఎలిమినేట్ కాగా..ఈ వారం ఎలిమినేషన్‌ జోన్‌లో దీప్తి నల్లమోతు, రోల్ రైడా, సామ్రాట్ రెడ్డి, తనీష్, తేజస్వి మదివాడలు ఉండటంతో ఆసక్తికరంగా మారింది. అయిదో వరం ఎలిమినేషన్ లో ముందంజ సబ్యులు ఉండగా...ఎవరు ఎలిమినట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు...

అయితే.. ఈ ఎలిమినేషన్‌ కోసం జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ అంత పకడ్బదీగా లేకపోవడంతో ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో ముందే నెట్‌లో లీకైంది. స్టార్ మా పేరుతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఓ డాక్యుమెంట్ నెట్‌లో హల్ చల్ చేస్తుంది. ఈ ఓటింగ్ ప్రకారం టీవీ 9 దీప్తికి అత్యధికంగా ఓట్లు రాగా.. ఆ తరువాతి స్థానంలో రోల్ రైడా , మూడో స్థానంలో తేజస్వి , నాలుగో స్థానంలో తనీష్, చివరి స్థానంలో సామ్రాట్  వెనకంజలో ఉన్నాడు. ఈ లీకైన లెక్కల్ని బట్టి ఐదోవారంలో ఎలిమినేట్ అయ్యే బలహీనమైన కంటెస్టెంట్ సామ్రాట్ అని తేలిపోయింది.  

ఇదిలా ఉంటే.. సామ్రాట్ ఒకవేళ హౌస్ నుండి ఎలిమినేట్ అయితే పాపం తేజస్వి పరిస్థితి ఏంటా అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరదలా వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో క్షణం కూడా ఒకర్ని విడిచి ఒకరు ఉండకుండా సెంటీమీటర్ గ్యాప్‌ కూడా లేకుండా హద్దుకుని ఉంటే ఈ ప్రేమజంట నుండి ఓ పక్షి బయటకు వస్తే.. హౌస్‌లో ఉన్న తేజస్వి ఏకాకిగా మిగిలిపోతుందని తెగ ఫీల్ అయిపోతున్నారు తేజస్వి ఆర్మీ. అయితే శుక్రవారం వరకూ ఓటింగ్‌కు సమయం ఉండటంతో తేజస్వి ఆర్మీ గ్యాంగ్.. సామ్రాట్‌ను హౌస్ నుండి బయటకు వెళ్లనీయకుండా ఓట్లను గుద్ది ఎలిమినేషన్‌ను జోన్ నుండి తప్పించి ప్రేమజంటను ఒకటిగా ఉంచుతారేమో చూడాలి........