ఆగస్ట్‌ 10న కమల్‌హాసన్‌ "విశ్వరూపం 2"

నటినటులు : కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. 
సంగీతం : మహమ్మద్‌ గిబ్రాన్‌
పాటలు : రామజోగయ్యశాస్త్రి
సినిమాటోగ్రఫీ : శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌
ఎడిటింగ్‌ : మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌
మాటలు : శశాంక్‌ వెన్నెలకంటి
నిర్మాతలు : ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, రచన
దర్శకత్వ : కమల్‌హాసన్‌ 
యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆస్కార్‌ ఫిలింస్‌ వి.రవిచంద్రన్‌ తెలిపారు. 

మరిన్ని కథనాలు

నా నువ్వే మూవీ...
మొదటిసారి మీడియా తో విడాకుల పై స్ప౦దించిన రేణు దేశాయ్
మొదటిసారి మీడియా...
సూర్య తొలి రోజే 40...
మనసైనోడు మూవీ...
నటనలో రకాలు
విడుదలకు సిద్ధమవుతున్న "సాక్ష్య౦"
విడుదలకు...