సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత'

సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత'
నటీనటులు : కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్య రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ : రాకేష్ శశి
నిర్మాత : రజిని కొర్రపాటి, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ 
ప్రెజెంటర్ : సాయి శివాని
కెమెరామెన్ : కె.కె.సెంథిల్
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్య : రెహమాన్, రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్ : రామకృష్ణ
స్టంట్స్ : జాషువ
కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. రాజేష్ శశి దర్శకత్వ వహించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది. విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. 

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు