తల్లి లేకుండ జాన్వి మొదటి పుట్టిన రోజు

తల్లి లేకుండ జాన్వి మొదటి పుట్టిన రోజు

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ మంగళవారం తన 21వ పుట్టినరోజు జరుపుకొన్నారు. తన తల్లి శ్రీదేవి లేకుండా ఆమె జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు. ఇంత కష్ట సమయాన్ని జాన్వి మాత్రం ధైర్య౦గా ఎదుర్కొంది. తన నివాసంలో కాకుండా ముంబయిలోని ఓ వృద్ధాశ్రమంలో తన పుట్టినరోజును జరుపుకొన్నారు.అనంతరం సోదరి సోనమ్‌కపూర్‌ నివాసంలో జాన్వి స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.‘‘నా పుట్టిన రోజున మీ అందరిని అడిగేదొకటే. మీ కన్నవారిని ప్రేమించండి. వారితో ఆనందంగా గడపండి. మీ ప్రేమ వారికి పంచండి. మీ జన్మకు కారకులు వారు’’ అంటూ తన బర్త్ డే సందర్భ౦గా రాసిన లెటర్ లో అందరినీ కోరింది.