జాన్వికి అభిమానుల ప్ర‌శంస‌లు!

జాన్వికి అభిమానుల ప్ర‌శంస‌లు!

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంది. జాన్వి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ ఫోటో కేవలం 2 గంటల్లోనే దాదాపు రెండు లక్షల లైక్‌లు, వేలాది కామెంట్స్‌తో హల్‌చల్‌ చేస్తుంది. అయితే ఈ ఫోటో కూడా అంత ప్రత్యేకమైనదేమి కాదు. ఎప్పుటి లాంటి ఫోటేనే. కానీ ఫోటోలో జాన్విని చూసిన వారికి మాత్రం శ్రీదేవి గుర్తుకొచ్చారు. అయితే ఆ ఫోటో చూసిని చాలా మంది నెటిజ‌న్ల‌కు శ్రీదేవి గుర్తుకువ‌చ్చింది. `నీ క‌ళ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నాయి.. అచ్చు మీ అమ్మ‌లాగానే`, `మీ అమ్మ నీ రూపంలో బ‌తికే ఉంది`, `నిన్ను చేస్తుంటే శ్రీదేవిని చూస్తున్న‌ట్టుగానే ఉంది` అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.