‘జంబ లకిడి పంబ’ మూవీ రివ్యూ

‘జంబ లకిడి పంబ’ మూవీ రివ్యూ

నటినటులు : శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్‌, స‌త్య రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌

సంగీతం : గోపీసుంద‌ర్

ఛాయాగ్ర‌హ‌ణం : స‌తీశ్ ముత్యాల‌

క‌ళ‌ : రాజీవ్ నాయ‌ర్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వ : జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)

స‌హ నిర్మాత‌ : బి.సురేశ్ రెడ్డి

నిర్మాణం : ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్

సంస్థ‌ : శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్

‘గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత శ్రీనివాస‌రెడ్డి న‌టించిన చిత్రం `జంబ‌ల‌కిడి పంబ‌`.కమెడియన్‌గా కొనసాగుతూనే హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న  శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ మోడ్రన్ జంబ లకిడి పంబ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది...అనేది చూద్దాం.

కథ : వ‌రుణ్ (శ్రీనివాస‌రెడ్డి) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. గ్రామ పెద్ద కుమారుడు అత‌ను. ప‌ల్ల‌వి (సిద్ధి)ని ప్రేమిస్తాడు. వారి పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌రు. దాంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వివాహం చేసుకుంటారు. అయితే చిన్న చిన్న పొర‌పొచ్ఛాలు వ‌స్తాయి. దాంతో లాయ‌ర్ హ‌రిశ్చద్ర‌ప్ర‌సాద్ (పోసాని)ను ఆశ్ర‌యిస్తారు. ఆయ‌న అప్ప‌టికే 99 విడాకులు ఇప్పించి ఉంటాడు. వీరిది 100వ విడాకుల కేసు. వరుణ్‌, పల్లవిలను విడగొడితే వంద జంటలకు విడాకులు ఇప్పించిన న్యాయవాదిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కుతానని సంబరపడుతుంటాడు హరిశ్చద్ర ప్రసాద్‌. ఇంతలో హరిశ్చద్ర ప్రసాద్‌ తన భార్యతో కలిసి గోవా టూర్‌కి వెళ్తాడు. మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ చనిపోతారు. పైకి వెళ్లాక దేవుడు హరిశ్చద్రను రానివ్వడు. ఇదేంటని హరిశ్చద్ర దేవుడిని అడిగితే.. ‘నువ్వు విడగొట్టాలనుకున్న వందో జంటను కలిపితేనే నీ భార్య వద్దకు నిన్ను పంపుతాను’ అని చెప్తాడు. అప్పుడు ఆత్మ రూపంలో కిందకి దిగివచ్చిన హరిశ్చద్ర ప్రసాద్..‌ వరుణ్‌, పల్లవిలను కలపడానికి ఎన్ని పాట్లు పడ్డాడు? ఎంతకీ కలిసి ఉండటానికి ఇష్టపడని వరుణ్‌, పల్లవి దంపతులపై జంబ లకిడి పంబ మంత్రం వేశాక ఏం జరిగింది? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : చీటికీ మాటికీ గొడ‌వ‌లు ప‌డే దంప‌తులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మాట నిజ‌మే. అలాగే కొంత‌మంది స్వార్థ‌ప‌రులైన న్యాయ‌వాదులు దీన్నే అవ‌కాశంగా భావించి డ‌బ్బు సంపాదించ‌డానికే మొగ్గుచూపుతుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా లాక్కొస్తుంటారు. ఒక్క క్ష‌ణం ఎదుటివారి స్థానంలో నిలుచుని ఆలోచిస్తే అంతా అదే స‌ర్దుకుంటుంది అని చెప్పే సినిమా ఇది. అయితే లైన్‌గా విన‌డానికి బావుంది కానీ, దర్శకుడు మురళీ కృష్ణ జంబ లకిడి పంబ స్థాయిలో అలరించటంలో ఫెయిల్‌ అయ్యారు. ముఖ్యగా ఫస్ట్‌ హాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా టీవీ సీరియల్‌ సాగటం ప్రేక్షకులను విసిగిస్తుంది. స‌త్య రాజేశ్ ప్ర‌వ‌ర్తించే విధానం స‌హ‌జంగా ఉంటుంది. హ‌రితేజ పాత్ర బావుంది. వెన్నెల కిశోర్ త‌న ప‌రిధిలో బాగా న‌టించారు. చాలా సంద‌ర్భాల్లో కామెడీ న‌వ్వించ‌లేక‌పోయింది.

ప్లస్ పాయింట్స్ : శ్రీనివాస్‌, సిద్ధి ఇద్నాని నటన

                         కెమెరా

మైనస్ పాయింట్స్ : పాట‌లు

                             కథ, కథనం