రౌడీ పోలీస్ గా నికిషా పటేల్

రౌడీ పోలీస్  గా నికిషా పటేల్

నటీనటులునికిషా పటేల్,భాను చందర్,ముకుల్ దేవ్,అమిద్,గబ్బర్ సింగ్ 

సమర్పణ : బాజీ

బ్యానర్ : ఆర్.ఎ ఆర్ట్ ప్రొడక్షన్స్

సినిమాటోగ్రఫీ : ముజీర్

నిర్మాత : వేణు

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వ౦ : జానీ

పవన్ కళ్యాణ్ పులి సినిమాతో పరిచయమైన బ్యూటీ నిఖిషాపటేల్. అలరించే అందం.. ఆకట్టుకునే అభినయం నిఖిషా సొంతం. అయితే కెర్రీర్ అనుకున్న౦తగ సాగలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో అలరించిన నిఖిషా ఇప్పుడు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీతో రాబోతోంది. ఈ సినిమాలో నిఖిషా పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్ కూడా ‘‘రౌడీపోలీస్’’ అని పెట్టారు. టైటిల్ తో పాటు నిఖిషా పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. రౌడీపోలీస్ లో ముకుల్ దేవ్ విలన్ గా నటిస్తున్నాడు.మరో ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ హీరో భానుచందర్ నటిస్తుండటం విశేషం. సినిమా కథను బట్టి యాక్షన్ ఎపిసోడ్స్ కు చాలా స్కోప్ ఉంటుంది. రిస్కీగా సాగే రోప్ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. వాటిని ఎలాంటి డూప్ లేకుండా అత్యంత రియలిస్టిక్ గా చేసింది హీరోయిన్ నిఖిషా. సినిమా కోసం కాదు కానీ ఆల్రెడీ నిఖిషా మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయిన్ అయి ఉంది. పైగా తను రియల్ బాక్సర్ కూడా. కాబట్టి ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చాలా ఈజీగా చేసేసింది. అంతేకాదు.. ఇకపైనా ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెబుతోంది. జానీ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీని ఆర్.ఎ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వేణు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.