హెబ్బా పటేల్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్ప౦దన!

హెబ్బా పటేల్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్ప౦దన!
నటీనటులుహెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్
డైరెక్టర్ : అయోద్యకుమార్ కృష్ణం శెట్టి
నిర్మాతలు : సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి
కెమెరామెన్ : ఉదయ్ గుర్రాల
మ్యూజిక్ : జాయ్ బరువ
ఎడిటర్ : ఆలయం అనిల్
రచయితలు : అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
ఆర్ట్ డైరెక్టర్ : హరి వర్మ
కో.డైరెక్టర్ : శ్రవణ్ కుమార్
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన '24 కిస్సెస్' సినిమా ఫస్ట్ లుక్ కు , హీరోయిన్ ఇలియానా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పదన లభించింది.  'మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వ వహించారు. 'మిణుగురులు' చిత్రం విమర్శకుల ప్రసంశలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.
సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. 24 కిస్సెస్ సినిమా అదే కోవలోకి చేరబోతోంది.  కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి.